About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday, 12 September 2014

షట్కోణం

                                                                         షట్కోణం

నిర్వచనం ఇచ్చుకోవాలి .
అర్థం కాని వాటినీ  ,అర్థం చేసుకోలేని వాటినీ 
వెదకాలి లోపల్లోపల 
 ప్రశ్నార్థకాలని .
ఒకరెవరో వస్తారు 
యేవో నిర్వచిస్తారు 
కొన్ని తెల్లటి మెత్తటి పావురాయిల గురించి 
మరొకరెవరో వాడి ముళ్ల గురించి 
బల్ల మీది పేపర్ వెయిట్ గర గర  తిరుగుతుంటుంది  
హటాత్ గా షట్కోణం మదిలో ఉదయిస్తుంది 
నిట్టూర్పు సుడులు తిరిగి తిరిగీ అణిగిపోతుంది 
అన్నింటినీ చిలక్కొయ్యకి ఏక మొత్తం గా తగిలించేసాక 
కొన్ని ఎర్రటి వుదయాల వేళ 
ఎవరో ఆర్త గీతం పాడుకుంటూ లోతుల్లో కి నడిచి వెళతారు 
అంతలోనే ఇక ఏదీ అదుపులో  వుండదు 
మొదలైన చోటికే చేరి పూర్ణ మవుతుంది 
అస్తవ్యస్తంగా నిలబడ్డ అనుభవాలు 
వరుస కట్టి దృశ్యమానమవుతాయి 

నిర్వచనం 
ఎప్పటికీ ఒక చిక్కు ప్రశ్నే 
అదొక్కటేనా 
నీడను వెదుకులాడటం కూడా 

Wednesday, 27 August 2014

చేపలు పట్టే జాలరి !

చేపలు పట్టే జాలరి !


 కలిసి  పెంచిన దూరంలో 
బహుశా 
ఈ దుఃఖం నీకొక రహస్యమే 

పూల పూల జీవన శైలిలో 
ఈ పరిమళం 
నీకు 
అనాఘ్రాతమే 

పర్లేదు 
అసంపూర్ణం అసంతృప్తి కాదు 
సంపూర్ణం సంతృప్తిని చేరదు

కానీ  
ఎందుకలా ...
వలలోను నీటిలోనూ 
ఏక కాలాన ఉంచి ఇలా ...Sunday, 8 June 2014

ఈ మధ్య నచ్చిన పాట ...!


Sunday, 18 May 2014

ఈ మధ్య నేర్చుకున్న పాట ...Saturday, 5 April 2014

Jao Pakhi Bolo Tare

Wednesday, 12 March 2014

నీ కొరకై ... ప్రభూ !

నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
1.
నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగినా నా హృదయమును -
నడిపించుము లోతునకు నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప నా నావలో
కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
2. రాత్రంతయు శ్రమ పడినా -
రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము రక్షించు
నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ
//నడిపించు //
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును
ప్రేమించుచునే - అరసితి నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //
4. ప్రభు మార్గము
విడచితిని - ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము
మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది ఫల హీనుడని ఇపుడు -
పాటింతు నీ మాట //నడిపించు //
5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోతైన
నా బ్రతుకు లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //
6.
ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటింతును లోకములో
- పరిశుద్దుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //

Monday, 18 November 2013

సబ్బుతో చేతులు కడుక్కుందాం !

 ఈ రోజు వీ ఎం బంజర్ హై  స్కూల్ లో పిల్లలకి ''సబ్బుతో చేతులు కడుక్కుందాం'' అనే అవగాహనా కార్యక్రమాని నిర్వహించాం . ఈ ప్రోగ్రాం నిజానికి బెంగాల్ లో యునిసెఫ్ వాళ్ళు నిర్వహించారు . ఆంధ్రా వెనుకబడిన ప్రాంతం  కాదని వారు భావించారు . ఖమ్మం జిల్లా చాలా వెనుక బడిన జిల్లా అందుకని మేమీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం .ఈ హైస్కూల్ లో  800 మంది పిల్లలు వున్నారు  . చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది . పిల్లలు మైనం బొమ్మలు ఎలా మలుచుకుంటే అలా ఒదుగుతారు . అందరూ సుబ్బరంగా  సబ్బు పెట్టి చేతులు కడుక్కున్నారు . పిల్లలనే అడిగి ఈ ప్రోగ్రాం నిర్వహించటానికి వాళ్ళ చేతే ఒక టీచర్ ని ఎంపిక చేయించాం . ఒక్కో క్లాస్ నుండీ ఒక్కో స్టూడెంట్ ని ఎంపిక చేయించి టీం లీడర్లని చేసాం . మళ్ళీ ఆరునెలలకి వస్తామని చెప్పి బై చెప్పాం . పిల్లలందరూ తుళ్ళింతలతో బై  చెప్పారు . . 

పై   ఫోటో చూసారా ,మహిళలదే రాజ్యాధికారం అని చాటుతూ టీం లీడర్స్ లో 7 గురు అమ్మాయిలూ ,[వాళ్ళు ఎంచుకున్న వాష్ లీడర్ మేడం భాను తో కలిపి 8 మంది ] ,6 గురు అబ్బాయిలు .