About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday 12 September 2014

షట్కోణం

                                                                         షట్కోణం

నిర్వచనం ఇచ్చుకోవాలి .
అర్థం కాని వాటినీ  ,అర్థం చేసుకోలేని వాటినీ 
వెదకాలి లోపల్లోపల 
 ప్రశ్నార్థకాలని .
ఒకరెవరో వస్తారు 
యేవో నిర్వచిస్తారు 
కొన్ని తెల్లటి మెత్తటి పావురాయిల గురించి 
మరొకరెవరో వాడి ముళ్ల గురించి 
బల్ల మీది పేపర్ వెయిట్ గర గర  తిరుగుతుంటుంది  
హటాత్ గా షట్కోణం మదిలో ఉదయిస్తుంది 
నిట్టూర్పు సుడులు తిరిగి తిరిగీ అణిగిపోతుంది 
అన్నింటినీ చిలక్కొయ్యకి ఏక మొత్తం గా తగిలించేసాక 
కొన్ని ఎర్రటి వుదయాల వేళ 
ఎవరో ఆర్త గీతం పాడుకుంటూ లోతుల్లో కి నడిచి వెళతారు 
అంతలోనే ఇక ఏదీ అదుపులో  వుండదు 
మొదలైన చోటికే చేరి పూర్ణ మవుతుంది 
అస్తవ్యస్తంగా నిలబడ్డ అనుభవాలు 
వరుస కట్టి దృశ్యమానమవుతాయి 

నిర్వచనం 
ఎప్పటికీ ఒక చిక్కు ప్రశ్నే 
అదొక్కటేనా 
నీడను వెదుకులాడటం కూడా 

No comments: