About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday 24 November 2014

ప్రాతినిధ్య కు సత్యవతి గారు రాసిన ముందు మాట .

అడిగిన వెంటనే సరళంగా స్పందించి ప్రాతినిధ్యకు ముందు మాట రాసి ఇచ్చిన సత్యవతి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు . అలాగే ''నమస్తే తెలంగాణా ''లో ప్రచురించిన కట్టా శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు . 




Thursday 13 November 2014

''మదనా సుందారి ... మదనా సుందారి !

ఇవాల్టి నా బూడిదరంగు రోజుకి ఉత్సాహపు కాంతులనద్దినవి గద్దర్ పాటలు , గోరటి  పాటలు . అందునుండి నాకు నచ్చినది  ... ఈ పాట .  బహు ముద్దువచ్చినది ఈ వాఖ్యాలు ''మదనా సుందారి ... మదనా సుందారి, కామందు  నీ మీద కన్నేసినాడో...  మదనా సుందారి ,, ఆ .. కామందు కళ్ళల్లో జిల్లెళ్ళు పాలు ... మదనా సుందారి  !!!!





మదనా సుందారి మదనా సుందారి... సందేడు కురులాది జమ్మిడి పాపలది మదనా సుందారి 
మదనా సుందారి మదనా సుందారి... కొమ్మల్లా మెరిసేటి నీ బొట్టు చూసో మదనా సుందారి
మదనా సుందారి మదనా సుందారి... నీళ్ళల్ల కదిలేటి నీ నీడ చూసో మదనా సుందారి
మదనా సుందారి మదనా సుందారి... వెన్నెలా రాత్రుల్లో వన్నెలు చూసో  మదనా సుందారి
మదనా సుందారి మదనా సుందారి...దారిన బోవంగ దొరగాడు కాసే మదన సుందారి
మదనా సుందారి మదనా సుందారి...సందుల్ల గాసిండు సైగ చేసిండు మదన సుందారి
మదనా సుందారి మదనా సుందారి...కనపడ్డ కన్నేలకు కన్ను గీటిన్డో మదనా సుందారి
మదనా సుందారి మదనా సుందారి...కన్నులల కడివేడు జిల్లేడు పాలో మదనా సుందారి
మదనా సుందారి మదనా సుందారి... నడుమూన కొడవలి కొసలు మేరవంగో మదనా సుందారి 
మదనా సుందారి మదనా సుందారి... బ్రహ్మ జమ్ముడు నరుక బాట బట్టిందో మదనా సుందారి
మదనా సుందారి మదనా సుందారి... వీరాయి పువ్వూలు పూసేటి వేల బిందెలతో నీళ్ళు తెచ్చేటి వేల 
మదనా సుందారి...మదనా సుందారి మదనా సుందారి...కాకార పువ్వూలు పూసేటి వేల కడవలతో నీళ్ళు తెచ్చేటి వేల  
మదనా సుందారి....మదనా సుందారి మదనా సుందారి...గుమ్మాడి పువ్వూలు పూసేటి వేల గుండిగలతో నీళ్ళు తెచ్చేటి వేల  
మదనా సుందారి....మదనా సుందారి మదనా సుందారి...సిగ్గూడు పువ్వూలు పూసేటి వేల సిత్తలతో గంధాము తీసేటి వేల 
మదనా సుందారి....మదనా సుందారి మదనా సుందారి...ఆవూలు దూడలు వచ్చేటి వేల ఆంబోతు రంకేలు ఏసేటి వేల  
మదనా సుందారి....మదనా సుందారి మదనా సుందారి ఆహాహ ఆహ ఆహ.....

లిరిక్స్  http://nishanthdongari.blogspot.in/ నుండి 
థాంక్స్ టు 

Wednesday 12 November 2014

మన భాష కాదు కానీ ... మనసు దోచే పాట !

''ఎ లెటర్ టు మోమో'' 2011 జపాన్ యానిమేషన్ సినిమా .దర్శకుడు Hiroyuki Okiura . 11 ఏళ్ళ అమ్మాయి కథ . మీకు పిల్లలుంటే తప్పక చూపించాల్సిన మూవీ . మీలో చిన్న పిల్లలుంటే తప్పక చూడాల్సిన మూవీ . నాకు ఎంత నచ్చిందంటే'' మై నైబర్ తొతోరో''తర్వాత ఇప్పుడిదే నా ఫేవరేట్ మూవీ . ఈ పాట ఎంత నచ్చిందంటే ఇప్పటికి బోల్డు సార్లు వినేసాను . ఈ పాట గురించి సమాచారం ఏంటంటే Yuko Hara, who is the keyboardist for the Japanese band Southern All Stars, reportedly spent 5 years working on this piece of music.'' She said that "I loved animation from a very young age, so being able to contribute the theme song for this film makes me happy and honored.".ఇక పాట  వినండి . లిరిక్స్ కింద ఇచ్ఛా చూడండి . 



sound of the wind moved my heart years later
my memory projects you in the farway sky
when i find myself wandering along the path to the sea
unchanging summer sunlight still shines upon me 
never-ending blue sky expandad above
when i expressed my feelings to the person forever in my heart 
let the passing clouds carry the song that connects our soul
the wind caressed my cheeks as seasons pass by
wherever you are , my dear love,please watch over me 
the town shimmers under the heat surrounded by the sound of waves
where is the fragment of my dream hiding
beautiful utopia ,grant me this wish
i put my hands together , grant me this wish 
i put my hands together and pray for everybody's happiness
life binds eternal love

Monday 10 November 2014

కొన్ని అబద్దాలు - అందమైన పాటలు ... శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్


ఒక తెల్లని క్రిస్టియన్ అబ్బాయి బ్రతుకు తెరువు కోసం బ్రాహ్మడినని అబద్దం చెబుతాడు . ఇంటిగలవారి అమ్మాయి కామోసనుకొని ప్రేమిస్తుంది . అది తెలిసి అబ్బాయి వుద్యోగం వదిలేసి వెళిపోవాలనుకుంటాడు . కథ అలా అలా అందమైన పాటలతో మలుపులు తిరిగి అమ్మాయి తండ్రి కూడా అదే బాపతు అనే ఫినిషింగ్ టచ్ తో సుఖాంతమవుతుంది .

అమ్మాయి తండ్రి బ్రాహ్మడే అయి వుంటే సినిమా అభ్యుదయ కేటగిరీలోకి వెళ్లి వుండేది . అలా కాకుండా సినిమాటిక్ గా వున్నా తప్పనిసరి అబద్దం లోకి నెట్టిన ప్రపంచ నైజాన్ని సున్నితంగా చెప్పి కొత్తదనాన్ని నిలుపుకుంది .

పాటలు ఆణిముత్యాలు . ఎన్ని ఏళ్ళు గడిఛి పోయినా ఈ పాటల సుగంధం ఆవిరి కాదు . నాకు ఈ ''రాకోయి ''పాట చాలా ఇష్టం . ఎన్నో సార్లు వెదికాను షేర్ చేద్దామని . ఇప్పుడు దొరికింది .

సినిమాని పాటలకోసమే కాదు imdb లో ఎవరో రాసారు జయప్రద గురించి absolutely bewitching అని అది అక్షరాలా నిజం . ఆవిడ అందం తో ఈ  సినిమా వెలిగిపోతుంటుంది . ఆ అందం కోసం కళ్లార్పకుండా  మూవీ చూడొచ్చు.